సుమ స్ట్రెస్ బస్టర్స్ కొత్త ఎపిసోడ్ రిలీజైంది!
on Jul 6, 2023
బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఎంతమందిలో ఉన్నా.. ఏ స్టేజ్ మీద అయినా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. స్పాంటేనియస్ కామెడీ పంచ్ లతో ఎప్పుడు ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలో కూడా తన ప్రతిభని కనబరుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ లోను వీడియోలు చేస్తూ బిజీగా ఉంటుంది సుమ.
సుమ కనకాల.. తన యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోలు కూడా చేస్తుంది. రీసెంట్ గా మహిళల కోసం ఒక వీడియోని చేసి మహిళలకి విలువైన టిప్స్ ని ఇచ్చింది సుమ. తనకు తోచినదే కాకుండా మహిళలకి ఎలా ఉండాలో కొన్ని కొత్త ఐడియాలని ఇస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.
తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని చేసింది సుమ. 'స్ట్రెస్ బస్టర్స్' పేరుతో యూట్యూబ్ లో అలరించడానికి.. మరో కొత్త సీజన్ ని స్టార్ట్ చేసిన సుమ.. అందులో మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేసింది. ఈ సీజన్ కోసం 3 నుంచి 6 ఏళ్ల వయసు ఉన్న పిల్లల యొక్క వన్ మినిట్ టాకింగ్ వీడియోని, రెండు ఫోటోలని.. వాటితో పాటుగా కాంటాక్ట్ డీటైల్స్ ని పంపించాలని అప్పట్లో సుమ చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు వారిలో కొందరిని ఫైనల్ చేసి వారితో సరదాగా మాట్లాడింది సుమ. వారితో గేమ్స్ ఆడిస్తూ, వారు చేసే అల్లరితో తను కూడా జాయిన్ అయ్యి మరింత ఆసక్తికరంగా చేసింది సుమ. కాగా ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
Also Read